పొంగుతున్న వాగులు, జలమయమైన రోడ్లు(పిక్చర్స్)

హైదరాబాద్: రెండు రోజులుగా రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రం నీటితో తడిసి ముద్దవుతోంది. హైదరాబాదుతో పాటు రాష్ట్రంలోని పలుచోట్ల బుధవారం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు పూర్తిగా నీటితో నిండిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

రోడ్లు నీటితో నిండిపోవడంతో నగరంలో ట్రాఫిక్ జామ్ అవుతోంది. పలు చోట్ల ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. దీంతో కొందరు రాత్రంతా జాగారం చేశారు. భారీ వర్షాల కారణంగా వాగులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వర్షాలు ఇంకా పడే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

ఎగువ కురుస్తున్న వర్షాలతో అదిలాబాదు జిల్లాలోని కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ప్రాజెక్టు గేటును అధికారులు ఎత్తివేశారు. ఖమ్మం జిల్లాలోని చీకుపల్లి వాగు పొంగుతోంది. దీంతో ఇరవై ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టులో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 18 గేట్లు ఎత్తి వేశారు. వర్షాలపై ముఖ్యమంత్రి అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు.

భారీ వర్షాలు

రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పలుచోట్ల పాత ఇళ్లు కూలాయి. ఒకరిద్దరు మృతి చెందారు.

నిలిచిపోయిన నీరు

భారీ వర్షాల కారణంగా హైదరాబాదులోని ఓ ప్రాంతంలో నిలిచిపోయిన నీరు. రహదారులు అన్నీ జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బంది అవుతోంది. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది.

ప్రవహిస్తున్న వాగు

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు పొంగుపొర్లుతున్న ఓ వాగు. రాష్ట్రంలోని పలు వాగులు పొంగిపొర్లుతున్నాయి. నదుల్లో కలుస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+