తెలంగాణ: కోదండరాం నుండి కెసిఆర్ ఆరా, అసంతృప్తి

మెదక్ జిల్లాలోని ఫామ్ హౌస్‌లో ఉన్న కెసిఆర్‌తో కోదండరామ్ గురువారం భేటీ అయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన కోదండను అడిగి తెలుసుకున్నట్లుగా సమాచారం. కాంగ్రెసు ఏం చేయాలనుకుంటుంది, తెలంగాణ ఇస్తుందా? ఇస్తే ఎలా ఇవ్వాలనే ఆలోచనలో ఉంది? తదితర అంశాలపై కోదండను అడిగి తెలుసుకున్నట్లుగా సమాచారం.
తెలంగాణపై జోరుగా ప్రచారం సాగుతున్నప్పటికీ కాంగ్రెసు పార్టీని నమ్మడానికి వీల్లేదని ఈ సమయంలో కోదండతో కెసిఆర్ అన్నారని సమాచారం. ఏం చెప్తారో వేచి చూద్దామని, అసలు తెలంగాణ ఇవ్వాలనుకుంటే డిఎంకె ఉన్నప్పుడే వచ్చేదని ఆయన కోదండతో అన్నారని సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహం పైన చర్చించినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెసు వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలని సూచించారని సమాచారం.
అదే సమయంలో కాంగ్రెసు పార్టీ వ్యవహారంపై అసంతృప్తితోను ఉన్నారట. తనను పరిగణలోకి తీసుకోకుండా జోరుగా చర్చలు సాగించడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారట. గతంలో తెలంగాణపై ఎలాంటి చర్చలు జరిగినా తనకు తెలిసేవని, ఇప్పుడు మాత్రం కాంగ్రెసు తమను కేర్ చేయకపోవడం ఆయనకు ఆగ్రహం తెప్పిస్తోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications