తెలంగాణ: పరిష్కార మార్గాలివేనా?, పార్టీలలో ఉత్కంఠ

కోర్ కమిటీ ముందున్నవి ఇవేనా?
రాష్ట్రాన్ని యథావిధిగా సమైక్యాంధ్రగానే ఉంచడం, హైదరాబాదు రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వడం, రాయల తెలంగాణ ప్రకటించడం, హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతంగా తెలంగాణ, ఆంధ్రలను విభజించడం లేదా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం.. ఇవే కోర్ కమిటీ ముందున్న పరిష్కార మార్గాలంటున్నారు. లేదంటే కోర్ కమిటీ ఇంకా ఏదైనా కొత్త కోణంలోను ఆలోచించే అవకాశాలు లేకపోలేదంటున్నారు. అయితే తెలంగాణకు అనుకూలంగానే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.
పలు పరిష్కార మార్గాల పైన బొత్స, కిరణ్, దామోదరలతో కోర్ కమిటీ చర్చంచనుంది. ఎలా చేస్తే సమస్య సాధ్యమైనంత తక్కువ రాజకీయ నష్టంతో పరిష్కరించవచ్చునని చర్చిస్తోందని అంటున్నారు.
విపక్షాల ఉత్కంఠ
కాంగ్రెసు పార్టీ కోర్ కమిటీ సమావేశాన్ని రాష్ట్రంలోని పార్టీలు అన్ని ఉత్కంఠగా పరిశీలిస్తున్నాయి. ఈ భేటీలో ఏం చర్చిస్తారు, ఏం నిర్ణయం తీసుకుంటారనే చర్చ ఆయా పార్టీలలో అంతర్గతంగా సాగుతోంది. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీ, వైయస్సార్ కాంగ్రెసు, మజ్లిస్ తదిత పార్టీలు కోర్ కమిటీ భేటీ నిర్ణయంపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.












Click it and Unblock the Notifications