డిప్యూటీకి కత్తి: ఒకే కార్లో బొత్స, కిరణ్ -ఎవరేం చెప్తారు?

ఉప ముఖ్యమంత్రి దామోదర, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణలు కోర్ కమిటీ భేటీకంటే ముందు రాష్ట్ర పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్, కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌లతో భేటీ అయ్యారు. ప్రధానమంత్రి నివాసానికి దామోదర చేరుకున్న కాసేపటికి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ వచ్చారు. ఆ తర్వాత కిరణ్, బొత్సలు ఒకే కారులో వచ్చారు.
ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు కాంగ్రెసు పార్టీ కోర్ కమిటీ భేటీ అయింది. ఈ భేటీలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఎకె ఆంటోనీ, సుశీల్ కుమార్ షిండే, దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్‌లతో పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు.
ఎవరేం చెప్తారు?
ఈ భేటీలో బొత్స, కిరణ్, దామోదరలు రోడ్ మ్యాపులు ఇస్తారు. ముఖ్యమంత్రి విభజిస్తే వస్తే నష్టాలను వివరించే అవకాశాలున్నాయంటున్నారు. తెలంగాణ సెంటిమెంట్ ఉందని, అయితే విభజిస్తే మాత్రం కాంగ్రెసు తెలంగాణ ప్రాంతంలో లాభపడదని, పైగా సీమాంధ్రలో నష్టపోవాల్సి ఉంటుందని కిరణ్ నివేదికలో ఉన్నట్లుగా సమాచారం. రాయల తెలంగాణ ఇస్తే పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఉందని ఆయన నివేదికలో ఉందంటున్నారు.
విభజన వల్ల భవిష్యత్తులో తాగునీరు, సాగునీరు సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని బొత్స నివేదికలో ఉన్నట్లుగా సమాచారం. విభజన జరిగినా సాగునీరు తదితర వాటిల్లో ఎలాంటి సమస్యలు తలెత్తవని, అవన్నీ అపోహలేనని దామోదర తన నివేదికలో పొందుపర్చినట్లుగా సమాచారం. నక్సల్స్ తదితర సమస్యలను పరిష్కరించుకుంటామని, తెలంగాణలో ఉన్న సెటిలర్లకు ఇబ్బందులు తలెత్తవని నివేదికలో పేర్కొన్నట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications