తెలంగాణకు అంగీకరించే ప్రసక్తే లేదు: ఎంపి రాయపాటి

Rayapati Sambasiva Rao
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు ఎట్టిపరిస్థితుల్లోను అంగీకరించబోమని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు గురువారం అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును సీమాంధ్ర నేతలు ఒప్పుకోరని రాయపాటి తిరుమలలో వ్యాఖ్యానించారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాజీనామాలకు కూడా వెనుకాడబోమన్నారు. అధిష్ఠానం తీసుకునే నిర్ణయం తెలంగాణకు అనుకూలమైతే అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

రాష్ట్ర విభజన ప్రయత్నాలను నిరసిస్తూ శుక్రవారం చిత్తూరు బంద్‌కు ఎమ్మెల్యే సికె బాబు పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర సాధనలో భాగంగా అవసరమైతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సికె బాబు ప్రకటించారు. పొట్టి శ్రీరాములు తన ప్రాణాలు పణంగా పెట్టి ఆంధ్రప్రదేశ్‌ను తెచ్చారని, తానంతటి గొప్పవాడిని కాకపోయినప్పటికీ సమైక్యాంధ్ర కోసం ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటానన్నారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా బద్వేలు శాసనసభ్యురాలు కమలమ్మ గురువారం తన పదవి రాజీనామా సమర్పించారు. సమైక్యాంధ్రకు తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని తన రాజీనామా పత్రాన్ని సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి నాయకులకు అందజేశారు.

ఉద్యమం పేరుతో కోట్లు గడిస్తున్నారు: ఎర్రబెల్లి

తెలంగాణ ఉద్యమం పేరుతో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కోట్లు గడిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నా రు. తెలంగాణకు టిడిపి వ్యతిరేకం కాదని తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడో చెప్పారన్నారు. కొందరు కావాలని పార్టీని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే ఈ ప్రాంతంలో తెరాస గల్లంతు కావడం ఖాయమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+