మంత్రి పార్థసారథిపై స్పీకర్‌కు జగన్ పార్టీ నేత ఫిర్యాదు

సుప్రీం తాజా తీర్పు ప్రకారం పార్థసారథి అనర్హుడని ఆయన అన్నారు. ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని తాను స్పీకర్‌ను కోరినట్లు చెప్పారు. హైకోర్టు తీర్పు మేరకు పార్థసారథి లక్షన్నర రూపాయల జరిమానా కట్టారని, ఆర్టికల్ 80ఈ ప్రజాప్రాతినిత్య చట్టం ప్రకారం ఆయన సభ్యత్వాన్ని కోల్పోతారన్నారు.
ఈ విషయమై తాను స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తే న్యాయనిపుణులతో చర్చిస్తానని చెప్పారన్నారు. పార్థసారథి పైన అనర్హత వేటు వేయకుంటే తాను హైకోర్టుకు వెళ్తానన్నారు. పార్థసారథి దోషి అని న్యాయస్థానం తేల్చిందని, కాబట్టి ఆయన అనర్హుడని అడుసుమిల్లి చెప్పారు.
ప్రత్యర్థులపై దాడులు: భూమన
పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో ఆరోపించారు. సంతలో ఎద్దులను పెట్టి బేరం చేసినట్లుగా సర్పంచులను ఏకగ్రీవం చేసేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తోందన్నారు.












Click it and Unblock the Notifications