గర్ల్‌తో అసభ్య ప్రవర్తన: యూఎస్‌లో ఆంధ్రా ఫాదర్ అరెస్ట్

​AP priest in Minnesota fondles minor, arrested
బ్లూఎర్త్/హైదరాబాద్: అమెరికాలో మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఫాదర్ లియో కొప్పలను పోలీసులు అరెస్టు చేశారు. లియో కొప్పల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డయోసిస్‌కు చెందిన వాడు. అతను నాలుగేళ్లుగా మిన్నెసొటా రాష్ట్రంలోని బ్లూఎర్త్‌లో పాల్ కేథలిక్, సెయింట్ పీటర్స్ చర్చీలో విధులు నిర్వహిస్తున్నాడు.

బ్లూ ఎర్త్‌లో ఓ వృద్ధ మహిళ మైనర్ అమ్మాయితో కలిసి నివసిస్తోంది. ఈ నెల 7న లియోను ఆ వృద్ధ మహిళ భోజానానికి ఆహ్వానించింది. లియోకు భోజనం పెట్టి ఆ మహిళ పని పైన బయటకు వెళ్లింది. భోజనం చేసిన ఫాదర్ లియో ఆ తర్వాత బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

ఆమె భయపడింది. వృద్దురాలికి విషయం చెప్పింది. ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అతడిని అరెస్టు చేశారు. లియోను తాము అరెస్టు చేశామని, విచారిస్తే తాను తప్పు చేసినట్లు అంగీకరించారని అమెరికా పోలీసులు తెలిపారు.

అనాథ, నిరుపేద చిన్నారులు, శ్రీ పొట్టి శ్రీరాములు, ప్రకాశం జిల్లాల్లో అనాథాశ్రమాల్లోని చిన్నారుల విద్య కోసం వివిధ కార్యక్రమాల ద్వారా లియో కొప్పల విరాళాలను సేకరిస్తుంటాడు. ఇతని వయస్సు 47. అతను అసభ్యంగా ప్రవర్తించిన అమ్మాయి వయస్సు పన్నెండేళ్లు ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+