స్టార్ బ్యాట్స్‌మన్‌ను డకౌట్ చేస్తాం: లగడపాటికి మంద

పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలను మళ్లీ మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ పన్నాగం పన్నిందని ఆరోపించారు. కాంగ్రెస్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పంచాయతీ ఎన్నికల ముందే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి మాట నిలుపుకోవాలన్నారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీ 15-16 పార్లమెంట్ సీట్లు గెలుస్తుందని, అప్పుడు ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు.
ఎవరు ఆపలేరు: కోదండ
హరిహరాదులు అడ్డొచ్చినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ కోదండరాం అన్నారు. ఇచ్చిన మాట ప్రభుత్వం నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేయడం తగదన్నారు. అటో ఇటో ఏదో ఒకటి తేలుస్తామంటున్నారని, తెలంగాణకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని కోదండరామ్ డిమాండ్ చేశారు.
పట్టణాలు, గ్రామాల్లో సాంస్కృతిక యాత్ర కొనసాగిస్తామని తెలిపారు. తీర్మానాలు చేసిన పత్రాల మీద బస్టాండ్‌లు, కళాశాలలు, రహదారులు, కూడళ్ల వద్ద ప్రజలతో సంతకాలు చేయిస్తామని చెప్పారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత పునర్ నిర్మాణం జరగాల్సిన అవశ్యకత ఉన్నదని, అందుకు ఈ రెండు రోజుల మేధోమధనంతో స్పష్టత వచ్చిందన్నారు. అధ్యయనం, కార్యాచరణ, అనుభవం, ఆలోచనలు ఒకదాని వెంట ఒకటి కొనసాగుతాయన్నారు.












Click it and Unblock the Notifications