కేంద్రానికి కట్టుబడ్తా: 'టి'పై చిరు, ఊహించలేం: అజర్

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కొందరు, విడగొట్టాలని మరి కొందరు డిమాండ్ చేస్తున్నారని ఆయన అన్నారు. కేంద్రం తీసుకునే నిర్ణయం కోసం తాను ఎదురు చూస్తున్నట్లు చిరంజీవి చెప్పారు. ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని అన్నారు.
పర్యాటక రంగం అభివృద్ధికి నిపుణులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. పర్యాటక రంగంలో ఉపాధిని పెంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పర్యాటక రంగంలో మహిళల భద్రతకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చిరంజీవి చెప్పారు.
ఇదిలావుంటే, తెలంగాణ అంశంపై కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది చెప్పలేమని పార్లమెంటు సభ్యుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహ్మద్ అజరుద్దీన్ అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లోకి రావడంపై తాను ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదని ఆయన అన్నారు. తెలంగాణ అంశంపై ఆయన ఆచితూచి స్పందించారు. తెలంగాణకు సంబంధించి కేంద్రం తీసుకునే నిర్ణయాన్ని ముందే చెప్పడం కష్టమని ఆయన అన్నారు.
తెలంగాణపై పిటిషన్ కొట్టివేత
తెలంగాణ ఏర్పాటుపై యాధాథతస్థితిని కొనసాగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం ఉదయం హైకోర్టు కొట్టివేసింది. అలాగే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్న తెరాస, బిజెపి, సిపిఐలను నిషేధించాలన్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది.












Click it and Unblock the Notifications