మూటల నిండా డబ్బు: యాచకురాలి వద్ద రూ.2 లక్షలు

ఇప్పుడు కర్నాటకలో ఓ వృద్ధ మహిళ వద్ద రెండు లక్షల రూపాయలకు పైగా పోలీసులు గుర్తించారు. యాచకురాలు కాలమ్మ దావణగెరె ప్రాంతంలో చెత్తకుప్పలోనే పడుకుంటోంది. ఆమె వద్ద ఎప్పుడూ మూడా నాలుగు పెద్ద మూటలు ఉంటాయి. చెత్తను తొలగించే ఉద్దేశ్యంలో భాగంగా మున్సిఫల్ అధికారులు ఆమె పడుకునే ప్రాంతంలో ఉన్న మూటలను తొలగించాలనుకున్నారు.
అవి చాలా బరువు ఉండటంతో తెరిచి చూశారు. అందులో నగదు, నోట్లు ఉన్నాయి. వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆమెను విచారించారు. తాను కష్టపడి సంపాదించుకున్న డబ్బేనని, అడుక్కోగా వచ్చిన డబ్బు అని చెప్పింది.
అర్ధరూపాయి, రూపాయి, నోట్లు పావలాలు అన్నీ ఉండటంతో ఆమె అడుక్కోగా వచ్చిన డబ్బేనని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఆ నగదు మొత్తాన్ని పోలీసులు ఆమె పేరిటే బ్యాంకులో వేశారు. ఆమెను ఓ వృద్ధాశ్రమంలో చేర్పించారు.












Click it and Unblock the Notifications