మాజీ భార్యను కిడ్నాప్ చేసి వేధించి, బ్లేడుతో కోశాడు

సేవ్రీలోని అదాంజీ జీవజీ చౌల్‌లో ఉండే ఇతనికి ముంబై శివారులో ఉండే ఇరవై ఒక్క ఏళ్ల యువతితో ఫిబ్రవరిలో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయింది. తనను వ్యాపారవేత్తగా పరిచయం చేసుకున్నాడు. స్నేహం చేశాడు. బాంద్రా ఫ్యామిలీ కోర్టులో వాళ్లు పెళ్లి చేసుకున్నారు.
ఆ తర్వాత బజ్జు తన భార్యను కొట్టి హింసించేవాడు. మతం మార్చుకోవాలని ఒత్తిడి చేసేవాడు. దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఆ తర్వాత జూన్ 17న బాధితురాలిని కిడ్నాప్ చేసిన బజ్జూ తన నివాసంలో బంధించాడు. ఆమెను కొట్టాడు. బ్లేడుతో ముఖం, మెడ, చేతుల పైన గాయాలు చేశాడు. బాధితురాలి శరీరంపై వందకు పైగా గాట్లు ఉన్నాయి.
చివరకు బాధితురాలు కిందటి నెల 26న అతని చెర నుండి తప్పించుకుంది. ఈ నెల మూడున ఆమె పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కాగా తన తండ్రి 1993 ముంబై పేలుళ్ల కేసులో నిందితుడని బజ్జు అంగీకరించాడని, అతనిపై 16 క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications