ఫ్రెండ్‌కు భార్యని అమ్మిన భర్త, పెళ్లాడానని మహిళ ట్విస్ట్

చవాన్ తన భార్యను మిత్రుడికి అమ్ముకున్నాడని పోలీసులు ఆదివారం చెప్పారు. ఇది తెలిసిన ఆ మహిళ సోదరి జూలై 12న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతనిని అరెస్టు చేశారు. ప్రస్తుతం భర్త చవాన్, మహిళను కొనుక్కున్న గణేష్‌లు పోలీసుల అదుపులో ఉన్నారు.
ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. చవాన్ తన భార్య సంగీతను గణేష్‌కు విక్రయించిన అనంతరం ఆమె అతనిని పెళ్లి చేసుకుంది. తాను గణేష్‌ను పెళ్లి చేసుకున్నానని, అతనితో సంబంధం కలిగి ఉన్నానని సంగీత పోలీసులకు చెప్పడం కొసమెరుపు. గణేష్‌ను ఈ నెల 15వ తేది వరకు కస్టడీకి తరలించారు.
రైల్లో దాష్టీకం
ఇటీవల చెన్నై నుంచి రైల్లో బరంపురం వచ్చిన ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు అపహరించి రైల్వే స్టేషన్ సమీపాన ఆమెపై సమామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications