రైలులో యువతిని వీడియో తీసిన ఇద్దరు జవాన్లు అరెస్ట్

Two CRPF jawans arrested for making video clip of woman on train
భోపాల్: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌(సిఆర్పీఎఫ్)కు చెందిన ఇద్దరు జవాన్లను ఆదివారం మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. రైలు ప్రయాణంలో ఉన్న ఓ యువతిని వీడియో తీసినందుకు వారిని అరెస్టు చేసినట్లుగా పోలీసులు చెప్పారు. 23 ఏళ్ల వయసున్న ఓ యువతి హజ్రత్ నిజాముద్దీన్ - హైదరాబాద్ మధ్య నడిచే దక్షిణ్ ఎక్సుప్రెస్‌ను ఎక్కింది.

ఆమె విదిష నుండి భోపాల్‌కు వెళ్లేందుకు శనివారం రాత్రి రైలు ఎక్కింది. ఎస్ 10 బోగీలో ఉన్న ఓ యువతిని అదే బోగీలో ఉన్న ఇద్దరు సిఆర్పీఎఫ్ జవాన్లు సెల్ ఫోనులో వీడియో తీశారు. అది గమనించిన ఆ యువతి వారిని అడ్డుకుంది. వారు వీడియో తీసిన సెల్ ఫోనును తీసుకునే ప్రయత్నం చేసింది.

వారు ఆమెపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమె రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారిని ధర్మేంద్ర కుమార్, దినేష్ కుమార్‌లుగా గుర్తించారు. ఆ తర్వాత ఇద్దరు బెయిల్ పైన విడుదలయ్యారు. విచారణ కొనసాగుతుందని పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+