మోడీ! మీ దృష్టిలో లౌకికవాదమంటే ఏంటి?: దిగ్విజయ్
న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెసు పార్టీ ఎదురు దాడికి దిగుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మోడీ చేసిన పప్పీ వ్యాఖ్యలు దుమారం రేపాయి. వాటిని పలు రాజకీయ పార్టీలు తప్పుపట్టాయి. అనంతరం ఆదివారం మోడీ ఫెర్గుసన్ విశ్వవిద్యాలయంలో మాట్లాడుతూ కాంగ్రెసు పార్టీ పైన నిప్పులు చెరిగారు. సవాళ్లు ఎదురైనప్పుడు కాంగ్రెసు లౌకికవాదం ముసుగులో దాక్కుంటుందని ఆరోపించారు.
పప్పీ వ్యాఖ్యల తర్వాత కాంగ్రెసు, బిజెపి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెసు నేతలు మోడీ వ్యాఖ్యల పైన నిప్పులు చెరిగారు. లౌకికవాదం అంటే ఏమిటో చెప్పాలని దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్, బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ దృష్టిలో ఒకే దేశం, ఒకే సంస్కృతి, ఒకే జాతి అని, మోడీ దృష్టిలో లౌకికవాదం అంటే ఏమిటో చెప్పాలన్నారు.

లౌకికవాదంపై మోడీ చేసిన వ్యాఖ్యలకు బిజెపి సమాధానం చెప్పాలని ఇతర నేతలు ప్రశ్నించారు. లౌకికవాదం అనేది అన్ని మతాలవారికి వర్తిస్తుందని, హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైనులు, క్రైస్తవులు.. అన్ని ధర్లాను ఆచరించే వారూ లౌకికవాదులుగానే ఉంటారని మనీష్ తివారి అన్నారు.
కమ్యూనలిజం మాత్రం సమాజాన్ని విడదీస్తుందని, వాళ్ల భాషలో కుక్కపిల్లలుగా భావించే వారిని ఆ కమ్యూనలిజం కింద నలిపేస్తారని మనీష్ పేర్కొన్నారు. ఆ రెంటి మధ్య ప్రజలకు ఏది మేలే ప్రజలే నిర్ణయించాలన్నారు.












Click it and Unblock the Notifications