సుప్రీం పచ్చజెండా: ముంబై బార్లలో మళ్లీ డ్యాన్స్‌లు

Supreme Court
న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజధాని ముంబై బార్లలో నృత్యాలకు సుప్రీంకోర్టు పచ్చ జెండా ఊపింది. మంగళవారం సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఎనిమిదేళ్ల తర్వాత ముంబైలోని బార్లు మళ్లీ అమ్మాయిల నృత్యాలతో తళుకులీననున్నాయి.

2005 బొంబాయి పోలీసు (సవరణ) చట్టం కింద మహారాష్ట్ర బార్లలో ప్రభుత్వం నృత్యాలను నిషేధించింది. దీన్ని బార్ యజమానులు, డ్యాన్సర్ల సంఘం సవాల్ చేసింది. ఈ సంఘానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెలువరించింది.

చట్టం అమలు రాజ్యాంగం ఆర్టిల్ 19 మేరకు వ్యక్తి వృత్తి చేసుకుని హక్కుకు భంగకరంగా మారిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కొన్ని సంస్థల్లో నృత్యాలను నిషేధించడాన్ని హైకోర్టు ఇంతకు ముందు సమర్థించింది. కొన్నింటిలో అనుమతిస్తూ కొన్నింటిలో వాటిని నిషేధించడాన్ని సవాల్ చేస్తూ సంఘం సుప్రీంకోర్టుకు వెళ్లింది.

ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వాటిని నిషేధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. బార్ డ్యాన్సింగ్‌ అసభ్యతను ప్రోత్సహిస్తున్నాయని, నైతిక విలువలకు విఘాతం కలిగిస్తున్నాయని, మనుషుల అక్రమ రవాణాకు, వ్యభిచారానికి ప్రోత్సహిస్తున్నాయని, నాట్యకత్తెలను దోపిడీకి గురి చేస్తున్నాయని ప్రభుత్వం ఆరోపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+