ఫ్రెంచ్ అమ్మాయిపై అసభ్యంగా: ఫ్రెండ్‌ను కొట్టారు

French girl molested, friend beaten
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఓ విదేశీ యువతిపై దారుణం జరిగింది. లేక్ గార్డెన్స్ ప్రాంతంలో రౌడీలు ఓ ఫ్రెంచ్ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ప్రతిఘటించడానికి ప్రయత్నించిన ఆమె మిత్రుడిని కొట్టారు. ఈ కేసులో పోలీసులు ఓ అనుమానితుడిని అరెస్టు చేశారు. అతనికి కోర్టులో బెయిల్ రావడంతో ఈ సంఘటన సోమవారం వెలుగు చూచసింది.

ఆ జంట కోల్‌కతాలో చదువుకుంటోంది. ఆదివారం తెల్లవారు జామున రెండున్నర గంటల ప్రాంతంలో ఆ వారిద్దరు జోద్‌పూర్ పార్కు వద్ద గల తమ ఇంటికి తిరిగి వస్తుండగా నలుగురు రౌడీలు లేక్ గార్డెన్స్, పండితీయ రోడ్ క్రాసింగ్ వద్ద అడ్డుకున్నారు. మహిళపై రౌడీలు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె మిత్రుడు ప్రతిఘటించడంతో అతన్ని తీవ్రంగా కొట్టారు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.

ఫ్రెంచ్ యువతి ఆదివారం తెల్లవారు జామును మూడున్నర గంటల ప్రాంతంలో లేక్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రహీమ్ అస్తగర్ లేన్‌కు చెందిన కమల్ నస్కర్‌ను అరెస్టు చేశారు. కమల్ నష్కర్‌కు సోమవారం బెయిల్ మంజూరైంది.

నస్కర్‌పై పోలీసులు గాయపరిచినందుకు, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు కేసు నమోదు చేశారు. దీంతో అతనికి బెయిల్ లభించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+