మోడీ హైదరాబాద్ సభకు ఫీజు, రూ. 5 టికెట్

హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ సభ విషయంలో బిజెపి ప్రయోగానికి సిద్ధపడింది. ఆయన ఆకర్షణను సొమ్ము చేసుకోవడానికి వ్యూహరచన చేసింది. వచ్చే నెల 11వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న మోడీ సభకు హాజరుకాదల్చినవారి నుంచి ఐదు రూపాయిలు చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది. సభకు హాజరయ్యే బిజెపి అభిమానులను గుర్తించడం, వారి నుండి సభ రుసుం వసూలు చేయడం వంటి బాధ్యతలను క్షేత్రస్థాయి నాయకులకు అప్పగించారు.

ఈ నిధులను పార్టీ అవసరాలకు లేదా సభ నిర్వహణకు కాకుండా, ఉత్తరాఖండ్ బాధితులకు వినియోగించాలని కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. రుసుం వసూలు చేయాలనే నిర్ణయాన్ని బిజెపి రాష్ట్ర నాయకులు సమర్థించుకుంటున్నారు. ఈ విషయాన్ని పార్టీ ప్రధానకార్యదర్శి ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, పార్టీ అధికార ప్రతినిధి ఎన్ రామచంద్రరావులు ఖరారు చేశారు. క్షేత్రస్థాయిలో సభకు హాజరయ్యే వారిని గుర్తించి వారి వివరాలను నమోదు చేసుకుని ఆహ్వాన పత్రాన్ని అందిస్తామని, ఆహ్వానపత్రం ఉన్న వారినే సభకు అనుమతించే అంశం కూడా పరిశీలిస్తున్నామని వారు చెప్పారు.

 Narendra Modi

మోడీ హైదరాబాద్ సభ దాదాపు ఎన్నికల సభగా నిర్వహించాలనే చూస్తున్నారు. ఈ సందర్భంగా మోడీ పార్టీ దిశనూ, దశనూ వివరించడంతో పాటు భవిష్యత్ పార్టీ సన్నాహాలను కూడా వివరించే అవకాశం ఉంది. టికెట్ పెట్టడం వల్ల మోడీ సత్తా మాత్రమే కాదు, పార్టీకి రాష్ట్రంలో ఉన్న పునాది ఏమిటో తెలిసి వస్తుందని ప్రభాకర్ వ్యాఖ్యానించారు. సభకు హాజరయ్యేందుకు ఆసక్తి ఉన్న వారు ఆన్‌లైన్‌లో కూడా తమ పేర్లను నమోదు చేసుకునే వీలుకల్పిస్తున్నట్టు వెల్లడించారు. మోడీ సభను నిర్వహించేందుకు ఇప్పటికే ఎల్‌బి స్టేడియంను ఖరారు చేశారు. గతంలో రెండు మార్లు మోడీ సభ తేదీ మారినా, మూడోమారు ఎలాంటి మార్పులు ఉండబోవని పార్టీ నేతలు చెబుతున్నారు.

కనీసం లక్ష మంది యువతను ఇందుకు సమీకరించాలని కూడా యోచిస్తున్నామని బిజెపి నాయకులు చెప్పారు. ప్రధానంగా వివిధ వృత్తుల్లో ఉన్న వారిని , ఐటి ఉద్యోగులను, న్యాయవాదులను, టీచర్లను సమీకరిస్తున్నామని ఇప్పటికే 40వేల మందిని గుర్తించి రిజిస్టర్ చేశామని పేర్కొన్నారు. మరో 70వేల మంది తేలికగా సభకు రుసుం చెల్లించి వస్తారని భావిస్తున్నాం అని రామచంద్రరావు తెలిపారు. తొలుత మోడీ సభను జూలై 27న నిర్వహించాలని అనుకున్నారు. అయితే పంచాయతీ ఎన్నికల కారణంగా సభను వాయిదా వేయాల్సి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+