వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు టీవీ చానెల్ ప్లాన్: లోకేష్ దర్శకత్వం?

By Pratap
|
Google Oneindia TeluguNews

Lokesh and Nara Chandrababu Naidu
హైదరాబాద్: ప్రతి పార్టీకి రాష్ట్రంలో టీవీ చానెళ్లు ఉన్నాయి. సిపిఎం లాంటి వామపక్ష పార్టీ కూడా తనదంటూ ఓ టీవీ చానెల్‌ను ఏర్పాటు చేసుకుంది. ఈ స్థితిలో తన కోసం ఓ టీవీ చానెల్‌ను ఏర్పాటు చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే, దాన్ని అధికారికంగా తనదిగా ప్రకటించుకోకుండానే దాన్ని నడపాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు.

చంద్రబాబు కోసం అనంతపురం జిల్లాకు చెందిన ఓ శానససభ్యుడు, నెల్లూరు జిల్లాకు చెందిన ఓ పారిశ్రామికవేత్త ఇదివరకే రిజిష్టర్ అయిన ఓ టీవీ చానెల్‌ను కొనుగోలు చేసినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా ఆ టీవీ చానెల్‌ను ఆపరేషన్‌లోకి తేవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదివరకు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ స్టూడియోఎన్‌ను నడిపాడు. అయితే, జూనియర్ ఎన్టీఆర్ మామకు చెందిన ఆ టీవీ చానెల్ అంతర్గత విభేదాల కారణంగా వెనక్కి పోయినట్లు చెబుతున్నారు.

వచ్చే ఎన్నికల లోగా దాన్ని పూర్తి స్థాయిలో నడిపించడానికి తెర వెనక నారా లోకేష్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఓ సీనియర్ జర్నలిస్టు ఇప్పటికే ఆ పనిలో నిమగ్నమై ఉన్నట్లు చెబుతున్నారు. మరింత మంది సీనియర్లను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాలన్నింటినీ నారా లోకేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని వినికిడి.

పార్టీ సిద్ధాంతాలను, కార్యక్రమాలను ప్రజలకు అందించే విధంగా దాన్ని రూపు దిద్దాలని నారా లోకేష్ భావిస్తున్నట్లు సమాచారం. పార్టీని తన చేతుల్లోకి తీసుకోవడానికి ఇదో ఆయుధంగా కూడా పనికి వస్తుందని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. అన్ని పార్టీలకు మీడియా సంస్థలున్నాయని, తమకు మాత్రం అలాంటిది లేదని చంద్రబాబు పదే పదే చెబుతూ వస్తున్నారు. అదే పద్ధతిని ఆ టీవీ చానెల్ పెట్టిన తర్వాత కూడా కొనసాగించాలని ఆయన అనుకుంటున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

ఇతర మీడియా సంస్థల సహకారంతో నెట్టుకుని వస్తున్న చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో తమకంటూ ఓ ప్రత్యేకమైన టీవీ చానెల్ ఉంటేనే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

English summary
The Telugu Desam Party Chief Nara Chandrababu Naidu has come up with a master plan to have an exclusive television channel for his self-promotion but without officially owning it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X