జడ్చర్ల ఎమ్మెల్యే బ్రదర్ కాల్చివేత, గర్ల్స్ హాస్టల్లో ర్యాగింగ్

Mahaboobnagar district
మహబూబ్‌నగర్: మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర బుధవారం కాల్పులతో దద్దరిల్లింది. జడ్చర్ల శాసన సభ్యుడి సోదరుడి పైన గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపడంతో ఆయన బుధవారం అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లాలోని దేవరకద్ర పాత బస్టాండు వద్ద ఓ కారులో ఎమ్మెల్యే తమ్ముడు జగన్‌మోహన్ ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.

దీంతో అతను కారులోనే మృతి చెందాడు. దుండగులు ద్విచక్ర వాహనం పైన వచ్చి కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. మరోవైపు దుండగులు స్కార్పియోలో వచ్చి కాల్పులు జరిపి పరారయ్యారనే వాదన కూడా వినిపిస్తుంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు.

బైక్ రేసింగ్ - ఐఏఎస్ అకాడమీ విద్యార్థి మృతి

ఔటర్ రింగు రోడ్డులో బైక్ రేసింగ్ ఓ ప్రాణం తీసింది. ఐఏఎస్ అకాడమీ విద్యార్థి ప్రసన్న కుమార్ మృతి చెందాడు. మరో విద్యార్థికి గాయాలయ్యాయి. ఈ ఘటన పెద్ద అంబరుపేట సమీపంలో జరిగింది.

గని ప్రమాదంలో కార్మికునికి గాయాలు

ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఏరియా వికె 7గనిలో జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు గాయపడ్డాడు. ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

హాస్టల్లో ర్యాగింగ్

విజయనగరం జిల్లాలో ఓ ప్రభుత్వ గర్ల్స్ హాస్టల్‌లో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. డిగ్రీ మూడో సంవత్సరం విద్యార్థినిలు జూనియర్లను ర్యాగింగ్ చేయడంతో, బాధితుల తల్లిదండ్రులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆర్డీవో నివేదిక ఇవ్వనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+