హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లవ్ అఫైర్: బిటెక్ విద్యార్థుల అత్మహత్యయత్నం

By Pratap
|
Google Oneindia TeluguNews

 Two BTech students attempt suicide
హైదరాబాద్: ప్రేమ వ్యవహారంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో వారు శరీరాలకు నిప్పంటించుకుని మరణించడానికి ప్రయత్నించారు. వారు ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులను మొహమ్మద్ రఫీక్, మోనికలుగా గుర్తించారు.

మొయినాబాదులోని కెజి రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో వారిద్దరు బిటెక్ చివరి సంవత్సరం చదువుతున్నారు. 21 ఏళ్ల వయస్సు గల వారిద్దరు ఒకే తరగతిలో చదువుతున్నారు. గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మోనికాకు మరో వ్యక్తితో నెల రోజుల క్రితం పెళ్లి నిశ్చయమైంది. ఇది ఆమెకు ఏ మాత్రం ఇష్టం లేదు.

మంగళవారం సాయంత్రం మోనిక, రఫీక్ గండిపేట - మొయినాబాద్ రోడ్డులో నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్లి శరీరాలపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. కాలిన గాయాలతో పడి ఉన్న వారిద్దరిని స్థానికులు గుర్తించి నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారిద్దరిని ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు బాధితుల వాంగ్మూలాలను రికార్డు చేశారు. తామిద్దరినీ విడదీయడానికి ప్రయత్నించడంతో తాము కలిసి మరణించాలని అనుకున్నట్లు వారు చెప్పారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

English summary
Two love-struck engineering students attempted suicide by setting themselves ablaze at Narsingi on Tuesday. Both the youngsters suffered third degree burns and are battling for life at Osmania General Hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X