గర్భం దాల్చాక..: ఇరాన్ గర్ల్‌ని చీట్ చేసిన యువకుడు

ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. విశాఖకు చెందిన మహ్మద్ సల్మాన్ వయస్సు ఇరవై అయిదు. అతను బిటెక్ పూర్తి చేశాడు. ఇరాన్ నుండి వచ్చిన సదరు యువతిని అతని ప్రేమించాడు. కొన్నాళ్లుగా సన్నిహితంగా మెలిగాడు. యువతి గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోమని కోరింది.
అందుకు అతను నిరాకరించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సల్మాన్ పైన మోసం, అత్యాచారం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతనిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.
గార్డెన్‌లో దారుణం
గుంటూరు జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్‌లో పైపుల మరమ్మతు కోసం వచ్చిన ఓ వ్యక్తి తల్లీకూతుళ్లను గాయపర్చాడు. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా, కూతురు గాయపడింది. ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
అగ్ని ప్రమాదం
హైదరాబాదులోని తార్నాకలో ఉన్న ఓ చైనా బజార్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం దుకాణం నుండి దట్టమైన పొగ రావడంతో గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. మూడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమను భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications