నేను హిందువును.. హిందువును!: బిజెపిపై దిగ్విజయ్

Digvijay Singh
న్యూఢిల్లీ: ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌లు తనను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరిస్తున్నాయని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మంగళవారం మండిపడ్డారు. తాను ఒక మంచి హిందువునని ఆయన చెప్పారు. హిందువులను మోసం చేయడానికే బిజెపి హిందుత్వ అంశాన్ని ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. తాను మంచి హిందువునంటూ తన బ్లాగులో రాసిన డిగ్గీ.. తనకు సంబంధించిన పలు అంశాలను పేర్కొన్నారు.

తానొక మంచి హిందువునని, మంచి హిందువు ఎల్లప్పుడూ ఇతర మతాలను గౌరవిస్తాడని బ్లాగులో పేర్కొన్నారు. తాను రోజు ఒక అరగంట పాటు దేవుడిని ప్రార్థిస్తానని, మధ్యప్రదేశ్‌లోని రఘోఘర్‌లో తమ ఇంటి దగ్గర తొమ్మిది ఆలయాలు ఉన్నాయని, ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న వేద పాఠశాలకు తాను చైర్మన్‌గా ఉన్నానని ఆయన రాశారు.

తాను ఇస్లాంలోకి మారానని ఒకసారి, క్రైస్తవం స్వీకరించానని మరోసారి సంఘ్ తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయన్నారు. తాను హిందూ వ్యతిరేక వాదినని అనే వారు తన ఇంటికి వచ్చి తన ఆధ్యాత్మిక, సనాతన ధర్మాలను తెలుసుకోవచ్చునని అన్నారు. తన ఇంటికి రావాలనుకునే వారు ఎప్పుడైనా రావొచ్చునని, పరిశీలించుకోవచ్చునని అన్నారు.

తన ఇంటికి వస్తే బిజెపి, సంఘ్ తనపై అవాస్తవాలు చెబుతుందనే విషయం అర్థమవుతుందన్నారు. తాను 1969 నుండి గాయత్రీ మంత్రం జపిస్తున్నానని, ఏకాదశి రోజుల్లో ఉపవాసం ఉంటానని, ఇరవై ఒక్క ఏళ్లుగా పండరీపురం సందర్శిస్తున్నానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+