సోనియా చెప్పడమే తరువాయి: తెలంగాణపై షిండే

Sushil Kumar Shinde
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పడమే తరువాయి అమలుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డితో చెప్పినట్లు సమాచారం. తెలంగాణపై రాజకీయ నిర్ణయం తీసుకోవడమే మిగిలి ఉందని, ఆ వెంటనే దాని అమలు దిశగా కేంద్ర హోంశాఖ చర్యలు చేపడుతుందని ఆయన అన్నట్లు తెలుస్తోంది.. తెలంగాణ సీనియర్ నేత, కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి షిండే ఆ మేరకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

మంగళవారం జైపాల్ రెడ్డితో, షిండే సుమారు 40 నిమిషాలపాటు భేటీ అయ్యారు. తెలంగాణపై సిడబ్ల్యుసి నిర్ణయం తీసుకోగానే దాని అమలుకు తమ శాఖ చర్యలు తీసుకుంటుందని షిండే చెప్పినట్లు తెలిసింది. తాను రాజకీయ నిర్ణయం కోసమే ఎదురు చూస్తున్నానని షిండే చెప్పారు. సోనియాగాంధీ అన్నింటికంటే ఎక్కువగా తెలంగాణకు ప్రాధాన్యతనిస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమస్యకు సాధ్యమైనంత త్వరలో స్పష్టమైన పరిష్కారం చూపాల్సిందిగా ఆదేశించారని షిండే చెప్పినట్లు తెలిసింది.

సోనియాతో పాటు అంతా అనుకూలంగా ఉన్నారని, అన్ని అంశాలను బేరీజు వేసిన తర్వాతే ఆమె ఒక నిర్ణయానికి వచ్చారని ఆయన అన్నారు. రాజకీయ నిర్ణయం తర్వాత ప్రభుత్వం వేగంగా నిర్ణయం తీసుకుంటుందని, మేడమ్ నిర్ణయాన్ని అమలు చేయడమే నా బాధ్యత' అని షిండే చెప్పారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ రాజకీయంగా రాష్ట్రంలో, ఆ తర్వాత దేశంలో నిలదొక్కుకోవాలంటే తెలంగాణ ఏర్పాటు తప్ప మరోమార్గంలేదని షిండేకు జైపాల్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఇవ్వడంవల్ల ఇప్పటి వరకూ రాజకీయ ప్రాధాన్యం లభించని అనేక వర్గాలకు అవకాశం లభిస్తాయని ఆయన చెప్పారు. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకూ అనేక సామాజిక వర్గాలకు న్యాయం జరగలేదని, సామాజిక న్యాయం జరిగితే కాంగ్రెస్ కూడా బలోపేతమవుతుందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+