వివేక్ ఎఫెక్ట్: టిడిపిలోకి టిఆర్ఎస్ నేత గోమాస శ్రీనివాస్

అనంతరం విలేకరులతో మాట్లాడారు. సామాజిక న్యాయం పాటించే ఏకైక పార్టీ తెలుగుదేశమని అన్నారు. అందుకే ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ ఎన్నికల నుంచి తర్వాత జరిగే అన్ని ఎన్నికలలోను ఆ పార్టీకి మద్దతివ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు.
తాను తెలంగాణ రాష్ట్ర సమితికి రాజీనామా చేస్తున్నానని, తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తున్నానని చెప్పారు. శ్రీనివాస్ దాదాపు టిడిపిలో చేరినట్లే. అయితే త్వరలో ఓ సభను పెట్టి అధికారికంగా చేరే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. శ్రీనివాస్ గత సాధారణ ఎన్నికలలో తెరాస అభ్యర్థిగా మహాకూటమి తరఫున పెద్దపల్లి పార్లమెంటు స్థానం నుండి పోటీ చేశారు.
వివేక్ ఎఫెక్ట్
పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు జి.వివేక్ ఇటీవల తెరాసలో చేరారు. 2009లో కాంగ్రెసు పార్టీ తరఫున గెలిచిన వివేక్.. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తెరాసలో చేరారు. వివేక్ వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి నుండే తెరాస తరఫున పోటీ చేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో అదే స్థానం నుండి వివేక్ పైన పోటీ చేసి ఓడిన శ్రీనివాస్ ఇప్పుడు టిడిపిలో చేరారు.












Click it and Unblock the Notifications