వాళ్లే చేయించారు: ఎమ్మెల్యే సోదరుడి హత్యలో మలుపు

నామినేషన్ ఉపసంహరించుకోకుంటే చంపేస్తానని తన భర్తను బెదిరించాడన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందన్నారు. తన సోదరుడి హత్యకు కారకుడైన నిందితులను అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని హత్యకు గురైన జగన్మోహన్ సోదరి శ్రీదేవి డిమాండ్ చేశారు.
కాగా బుధవారం సాయంత్రం దేవరకద్రలో జడ్చర్ల ఎమ్మెల్యే సోదరుడు జగన్మోహన్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఓ వాహనంలో వచ్చిన దుండగులు పాత బస్టాండు సమీపంలో ఆయనపై కాల్పులు జరిపారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
ఎమ్మెల్యే సతీమణి, ఎమ్మెల్యే సతీమణి ఇద్దరు తమ స్వగ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో హత్య జరిగి ఉండవచ్చునని నిన్నటి నుండే పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే హైదరాబాదులో జగన్మోహన్‌కు వ్యాపారాలున్నందున ఆ కోణంలోను పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications