శవమై తేలిన భారత సంతతి నటుడు పాల్ గౌతమ్

ఈ నెల 10వ తేదీన లండన్‌లోని స్లోయనీ స్క్వేర్‌లో గల రాయల్ కోర్టు థియేటర్‌లో పాల్ భట్టాచార్జీ రిహార్సల్ చేశారు. ఆ తర్వాత ఆయన కనిపించుకుండా పోయారు. తాను ఇక కనిపించనని ఆయన 10వ తేదీ రాత్రి తన స్నేహితురాలికి ఫోన్ ద్వారా సందేశం పంపారు.
పాల్ అదృశ్యంపై రాయల్ కోర్టు థియేటర్ ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పాల్‌కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఆ థియేటర్ ప్రతినిధి పోలీసులకు అందించారు. ఆయన కోసం గాలించిన పోలీసులు సుసెక్స్ వద్ద ఆయన మృతదేహాన్ని గుర్తించారు.
పాల్ ద బెస్ట్ ఎక్సోటిక్ మారీగోల్డ్ హోటల్, వైట్ టీత్, డర్టీ ప్రెట్టీ థింగ్స్ తదితర చిత్రాల్లో నటించారు. అయితే, ఆయన ఈ వారంలో జరిగే బ్ాలక్ కామెడీ షోకు హాజరు కావాల్సి ఉంది. 2006లో విడుదలైన జేమ్స్ బాండ్ నటించిన క్యాసినో రాయల్ చిత్రంలో పాల్ భట్టాచార్జీ వైద్యుని పాత్ర పోషించారు.












Click it and Unblock the Notifications