సోదరుడి హత్య: ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ అదృశ్యం

బుధవారం సాయంత్రం శేఖర్ తన వాహనంలో ఆత్మకూరు మార్గంలో వేగంగా వెళ్తుండగా కొంతమంది యువకులు చూసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. శేఖర్ బెంగళూరులో తలదాచుకున్నారా? లేక హైదరాబాదులోనే బంధువుల ఇళ్లలో ఆశ్రయం తీసుకున్నారా? అనే దిశగా దర్యాప్తు బృందాలు గాలిస్తున్నట్లు సమాచారం.
ఎమ్మెల్యేతో పాటు మరో ఇద్దరు అనుమానితుల ఆచూకీ కోసం కూడా ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. మరోవైపు పంచాయతీ ఎన్నికలు కోసం జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమయ్యింది. సాధారణంగా, ఎన్నికల ముందు, ఆయా ప్రాంతాల్లోని వీఐపీల వద్ద ఉండే లైసెన్సుడు ఆయుధాలను సంబంధిత పోలీసు స్టేషన్‌లలో డిపాజిట్ చేయిస్తారు.
కానీ, ఇప్పుడు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల వద్ద ఉన్న ఆయుధాలను కూడా వెంటనే సరెండర్ చేయాలని పోలీసు ఉన్నతాధికారులు కోరినట్లు సమాచారం. తన భర్త హత్యలో ఎర్ర శేఖర్ పాత్ర ఉన్నట్లు హతుడు జగన్మోహన్ భార్య ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications