చెైనాకు షాక్: బీజింగ్ విమానాశ్రయంలో పేలుడు

ఆ వ్యక్తి ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. ఆ వ్యక్తి తన వద్ద ఉన్న పేలుడు పదార్థాలను పేల్చి వేశాడని చెబుతున్నారు. బీజింగ్ విమానాశ్రయం మూడో టెర్మినల్ వద్ద ఈ పేలుడు సంభవించింది. సాయంత్రం 6 గంటల 24 నిమిషాలకు ఈ సంఘటన చోటు చేసుకుంది.
పేలుడు సంభవించిన వెంటనే విమానాశ్రయంలో దట్టమైన పొగ వ్యాపించడంతో ఎవరికీ కొంతసేపు ఏమీ కనిపించలేదు. పోలీసులు వెంటనే విమానాశ్ర యంలో ప్రతి వస్తువునూ తనిఖీ చేయడం ప్రారంభించారు. బాణాసంచాను తయారు చేసే నల్లటి గన్ పౌడర్ పేలిందని సమాచారం.
గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే చైనా సెంట్రల్ టెలివిజన్ తన మైక్రోబ్లాగ్ ద్వారా తెలిపింది. ఇతరులెవరూ గాయపడలేదని స్పష్టం చేసింది. విమానాల రాకపోకలకు అంతరాయం కలగలేదని, విమానాశ్రయంలో సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపింది.












Click it and Unblock the Notifications