పొలిటికల్ ప్లాన్ లేదు, నేను ఇమడలేను: ఉదయభాను

హైదరాబాద్: ప్రముఖ నటి, టివి యాంకర్ ఉదయ భాను తాను రాజకీయాలకు సరిపోవని చెబుతున్నారు. ఉదయ భాను రాజకీయాలలోకి వస్తారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. అయితే ఆమె ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని చెప్పారు.

రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదన్నారు. తనకు కొన్ని రాజకీయ పార్టీల నుండి ఆఫర్స్ వచ్చాయని, ప్రాధాన్యత కలిగిన పదవులు ఇస్తామని చెప్పారని కానీ, తాను అంగీకరించలేదన్నారు. తన కలం ద్వారా సమాజంలోని రుగ్మతల పైన పోరాడదల్చుకున్నట్లు చెప్పారు.

Udaya Bhanu

తాను రాజకీయాల్లో ప్రవేశించినా తాను ఒక్క దానినే సమాజాంలో మార్పును తీసుకు రాలేనన్నారు. తాను ఫ్రాంక్‌గా ఉంటానని, తాను రాజకీయాలకు సరిపోనన్నారు.. తాను సెన్సిటివ్ వ్యక్తినని చెప్పారు.

కాగా ఉదయ భాను ఇటీవల పాడిన ఓ పాటలోని వ్యాఖ్యలు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అవి ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఉన్నాయనే వాదనలు వినిపించాయి. అయితే అది కాంట్రవర్సీ కావడంతో దానిని ఇంటర్నెట్ నుండి తొలగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+