అదో భజన బ్యాచ్, మా సంస్కారం కాదు: షర్మిల ఎద్దేవా

Sharmila
విజయవగరం: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్, శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లాకు చెందిన ఆనం సోదరులు.. రామనారాయణ రెడ్డి, వివేకానంద రెడ్డిలది ఓ భజన బ్యాచ్ అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల ఎద్దేవా చేశారు. ఆమె మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది.

తాను విజయనగరం జిల్లాకు రాకముందు బొత్స మద్యం మాఫియా డాన్ అని మాత్రమే విన్నానని, వచ్చాక ఆయనకు ఎన్ని వ్యాపారాలు ఉన్నాయో తెలిసందన్నారు. తాము ఏనాడు వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించలేదన్నారు. అది తమ సంస్కారం కాదన్నారు. కానీ బొత్స మాత్రం చనిపోయిన తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి పైన కూడా పసలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

కొత్తనాయకుల కోసం పాతనాయకులను తూలనాడడం బొత్స, ఆనం బ్రదర్స్, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి భజన బ్యాచ్‌కు అలవాటే అన్నారు. ఉత్తరాంధ్రలో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును సర్కారు పక్కన పడేసినా బొత్సకు పట్టలేదన్నారు.

షర్మిల పాదయాత్ర ఆదివారంతో 216వ రోజుకు చేరుకుంటుంది. షర్మిల శనివారం రాత్రి ఏడున్నరకు పాత సంతోషపురం వద్ద బస చేశారు. ఆదివారం షర్మిల పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఈ రోజు సాయంత్రం వీరఘట్టం మండలం కడకెల్ల గ్రామం వద్ద ఆ జిల్లాలోకి ప్రవేశిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+