పెళ్లి కాలేదని చెప్పి మోసం, ఫేస్‌బుక్ ఫ్రెండ్‌పై గ్యాంగ్ రేప్

అతనికి విధించిన జరిమానాను బాధితురాలికి ఇవ్వనున్నారు. విడో అయిన ఆ బాధితురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. జూలై 22, 2008లో నిందితుడు ఆమెను ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నాడు. అయితే అప్పటికే అతనికి పెళ్లైంది. ఇది తెలుసుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేశారు.
ఫేస్‌బుక్ స్నేహితురాలిపై అత్యాచారం
ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన మహిళపై ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. మరో ఇద్దరితో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒక ప్రయివేటు విద్యా సంస్థ డైరెక్టర్‌కు ఐదు నెలల క్రితం ఇంజనీరింగ్ చదువుతున్న ఓ యువతితో ఫేస్‌బుక్‌లో పరిచయమైంది.
ఈ నేపథ్యంలో అతను ఆమెను విందుకు ఆహ్వానించాడు. విందు అనంతరం ఆమెను కారులో ఎక్కించుకొని వెళ్లాడు. మధ్యలో స్నేహితుడి కారులో ఎక్కారు. కారు డ్రైవర్ ఆమెకు బలవంతంగా మద్యం ఇచ్చాడు. అనంతరం వారు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications