అక్టోబర్‌లో 'టి': పాల్వాయి, అసద్‌కు దత్తాత్రేయ సూచన

Palvai Goverdhan Reddy
హైదరాబాద్: అక్టోబర్ నెలలోపు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఓ కొలిక్కి వస్తుందని కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆదివారం అన్నారు. 2014 ఎన్నికలు రెండు రాష్ట్రాల్లోనే జరుగుతాయని అన్నారు. తెలంగాణ ఏర్పాటు ఖాయమన్నారు. బిజెపి, తెలుగుదేశం, టిఆర్ఎస్‌కు చెందిన కొందరు తెలంగాణ రాదని చేస్తున్న ప్రచారం సరికాదన్నారు. తెలంగాణ ఇస్తే దేనికైనా సిద్ధమని తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గతంలోనే చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలన్నారు.

తెరాసను కాంగ్రెస్‌లో విలీనం చేయాలని కోరారు. అయితే కాంగ్రెస్ నుంచి తెరాసలోకి వెళ్లిన ఒక నక్షత్రకుడు ఎలాంటి చెడు ప్రభావాన్ని చూపిస్తారోననే ఆందోళన తమకు ఉందన్నారు. ఆ నక్షత్రకుడు కెసిఆర్‌ను పక్కదోవ పట్టించే అవకాశాలు లేకపోలేదన్నారు. రెండు రాష్ట్రాల పునర్ విభజన కమిషన్‌ను వేయాలంటూ గతంలో చేసిన తీర్మానాన్ని సిడబ్ల్యూసి ఉపసంహరించుకొని తెలంగాణకు సిఫార్సు చేసే అవకాశముందన్నారు.

ఇప్పటికే తెలంగాణపై అధిష్ఠానం అన్ని విధాలుగా ఆలోచన చేసిందన్నారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇవ్వడానికే సిద్ధంగా ఉందని, రాయల తెలంగాణ అంశాన్ని అధిష్ఠానం పక్కన పెట్టిందని ఆయన చెప్పారు. తెలంగాణ నాయకులు ప్రశాంతంగా ఉండాలన్నారు. యువకులు, విద్యార్థులు భావోద్వేగానికి గురై ఆత్మబలిదానాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన తర్వాత భద్రాచలం తెలంగాణతోనే ఉంటుందని పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు.

అసద్.. అడ్డుపడకు: దత్తాత్రేయ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా కొందరు కాంగ్రెసు నేతలు ప్రయత్నిస్తున్నారని, వారు తమ ఎత్తుగడలకు మజ్లిస్‌ను పావుగా వాడుకుంటున్నారని బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తామన్న మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాలకు అడ్డుపడటం సరికాదని అసద్‌కు దత్తాత్రేయ హితవు పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+