టెక్కీ భార్య చనిపోలేదు: లవర్‌తో కోయంబత్తూర్‌లో

శవాన్ని శరవనన్, ఆమె తల్లిదండ్రులు కూడా చూసి అది గంగాదేవిదే అయి ఉండవచ్చునని అనుమానించారు. కానీ, శరనివారం రాత్రి గంగాదేవి ఫోన్ చేసింది. గంగాదేవి కోయంబత్తూర్‌లో తన ప్రియుడితో పాటు ఓ హోటల్లో ఉంది. శవాన్ని తీసుకువెళ్లి అంత్యక్రియలు చేద్దామని కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో గంగాదేవి నుంచి ఫోన్ వచ్చింది. పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి ఆమె ఫోన్ చేసినట్లు చెబుతున్నారు.
పూర్తి నగ్నంగా ఉన్న మృతదేహాన్ని చూసిన శరవనన్ అది తన భార్యది కాకపోవచ్చునని మొదట అన్నారు. శవం గంగాదేవిది మాదిరిగానే కనిపిస్తోందని ఆమె బంధువులు అనడంతో అతను కావచ్చునని అన్నాడు. అయినా పోలీసులు డిఎన్ఎ పరీక్షలు చేసి నిర్ధారించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.
గంగాదేవి తన సోదరుడు సుకుమారన్‌కు ఫోన్ చేసి తాను బతికే ఉన్నానని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. తాను తన ప్రియుడు కార్తిక్‌తో ఉన్నానని, అందువల్ల ఇంటికి రావడానికి భయపడుతున్నానని గంగాదేవి చెప్పింది. కార్తిక్ తిరునింద్రవూర్‌లోని గంగాదేవి తల్లిదండ్రుల ఇంటి పక్కన ఉంటాడు.












Click it and Unblock the Notifications