పంచాయతీ: మేకపాటికి షాక్, ఎమ్మెల్యేల భార్యలు విన్

తెలంగాణ జిల్లాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నప్పటికీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఆయా గ్రామాల్లో తొలుత వార్డు సభ్యుల ఓట్లు, ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి సొంత ఊరు బ్రాహ్మణపల్లిలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి గెలుపొందారు. కరీంనగర్ జిల్లా రామగుండం మండలం సోమనపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిని భర్త పైన ప్రత్యర్థులు దాడి చేశారు. నల్గొండ జిల్లా యాదగిరి గుట్ట మండలం జంగంపల్లెలో తెరాస మద్దతుదారులపై కాంగ్రెసు వర్గీయులు దాడి చేయగా పోలీసులు చెదరగొట్టారు.
మహబూబ్ నగర్ జిల్లా పెద్దచింతలగుంటలో జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ సతీమణి గెలుపొందారు. తూర్పు గోదావరి జిల్లా గంగవరం మండలం లక్కొండ గ్రామంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కాశీ విశ్వనాథ రెడ్డి సతీమణి విజయం సాధించారు.
సాయంత్రం వరకు ఆయా జిల్లాల్లో ఆయా పార్టీలు బలపర్చగా గెలిచిన అభ్యర్థులు...
కృష్ణా - కాంగ్రెసు 14, టిడిపి 26, వైయస్సార్ కాంగ్రెసు 6
ఎస్పీఎస్ నెల్లూరు - కాంగ్రెసు 36, టిడిపి 33, వైయస్సార్ కాంగ్రెసు 35
గుంటూరు - కాంగ్రెసు 12, టిడిపి 39, వైయస్సార్ కాంగ్రెసు 21
విజయనగరం - కాంగ్రెసు 52, టిడిపి 11, వైయస్సార్ కాంగ్రెసు 17
విశాఖ - కాంగ్రెసు 4, టిడిపి 1, వైయస్సార్ కాంగ్రెసు 1
తూర్పు గోదావరి - కాంగ్రెసు 12, టిడిపి 5, వైయస్సార్ కాంగ్రెసు 15
పశ్చిమ గోదావరి - కాంగ్రెసు 14, టిడిపి 23, వైయస్సార్ కాంగ్రెసు 8
ప్రకాశం - కాంగ్రెసు 13, టిడిపి 33, వైయస్సార్ కాంగ్రెసు 15
శ్రీకాకుళం - కాంగ్రెసు 41, టిడిపి 55, వైయస్సార్ కాంగ్రెసు 25
అనంతపురం - కాంగ్రెసు 13, టిడిపి 41, వైయస్సార్ కాంగ్రెసు 21
కడప - కాంగ్రెసు 21, టిడిపి 8, వైయస్సార్ కాంగ్రెసు 36
కర్నూలు - కాంగ్రెసు 46, టిడిపి 11, వైయస్సార్ కాంగ్రెసు 15
చిత్తూరు - కాంగ్రెసు 36, టిడిపి 97, వైయస్సార్ కాంగ్రెసు 57
అదిలాబాద్ - కాంగ్రెసు 2, టిడిపి 6, తెరాస 3, వైయస్సార్ కాంగ్రెసు
కరీంనగర్ - కాంగ్రెసు 26, టిడిపి 8, తెరాస 8, వైయస్సార్ కాంగ్రెసు 5
రంగారెడ్డి - కాంగ్రెసు 6, టిడిపి 5, తెరాస 1, వైయస్సార్ కాంగ్రెసు 1
వరంగల్ - కాంగ్రెసు 13, టిడిపి 7, తెరాస 10, వైయస్సార్ కాంగ్రెసు 2,
మెదక్ - కాంగ్రెసు 10, టిడిపి 3, తెరాస 28, వైయస్సార్ కాంగ్రెసు
నల్గొండ - కాంగ్రెసు 19, టిడిపి 5, తెరాస 16, వైయస్సార్ కాంగ్రెసు 4
మహబూబ్ నగర్ - కాంగ్రెసు 29, టిడిపి 29, తెరాస , వైయస్సార్ కాంగ్రెసు 15
నిజామాబాద్ - కాంగ్రెసు 21, టిడిపి 19, టిఆర్ఎస్ 8, వైయస్సార్ కాంగ్రెసు












Click it and Unblock the Notifications