ఢిల్లీ తరహా రాష్ట్రం ఒప్పుకోం: హైదరాబాద్‌పై హరీష్ రావు

ఢిల్లీ తరహా రాష్ట్రం తమకు అక్కర్లేదని ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణ విషయంలో తాత్సారం చేసేందుకు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కొత్త ఎత్తుగడకు శ్రీకారం చుడుతోందని, అర్థం పర్థం లేని ఇలాంటి ప్రతిపాదనలకు ఒప్పుకొనేది లేదని చెప్పారు. కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీ తరహా రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఇటువంటి రాష్ట్రాల్లో హోంశాఖ, రెవెన్యూ ఆదాయంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారం ఉండదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయంలో ఉన్న తెలంగాణనే ఎలాంటి ఆంక్షలు లేకుండా తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోర్ కమిటీలోనే తెలంగాణపై తేల్చేస్తామని తొలుత కాంగ్రెస్ నమ్మబలికిందన్నారు.
ఇంతలోనే రాయల తెలంగాణ అని, ఢిల్లీ తరహా తెలంగాణ అని రోజుకో కొత్త నాటకాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణలు కేంద్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications