చీటింగ్ కేసులో జగన్‌పార్టీ నేత సిద్ధార్థ అరెస్ట్: బహిష్కరణ

కాగా, రాజమండ్రి దోపిడీ కేసు, విశాఖలో నకిలీ కరెన్సీ చెలామణి చేసిన కేసుల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల పాత్రపై దుమారం చెలరేగిన విషయం మరుపునకు రాక ముందే నిజామాబాద్ జిల్లాలో మరో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడి బండారం బయట పడిన విషయం తెలిసిందే.
తక్కువ ధరకు బంగారం ఇస్తామని మోసం చేసిన కేసులో సిద్దార్థ రెడ్డి నిందితుడు. దశాబ్దంన్నర క్రితం ఒక ఫైనాన్స్ సంస్థను పెట్టి ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి, శఠగోపం పెట్టి వెళ్లిన పెద్ద పటోళ్ల సిద్దిరాం రెడ్డి (సిద్ధార్థరెడ్డి) మాయమయ్యాడు.
ఆ తర్వాత ఇటీవలే వైయస్సార్ కాంగ్రెసు నాయకుడిగా మళ్లీ నిజామాబాద్ జిల్లాకు చేరాడు. ఇటీవల పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పర్యటన సందర్భంగా సిద్ధార్థ రెడ్డి హల్ చల్ చేశారు. 1995లో పంచజన్య రికరింగ్ డిపాజిట్ పథకం పేరిట డిపాజిట్లు వసూలు చేసిన సిద్దార్థ రెడ్డి ఆ తరువాత మాయమయ్యాడు.












Click it and Unblock the Notifications