ఢిల్లీ మెట్రో: ప్రేమికుల జోరు, మరో సెక్సీ వీడియో లీక్

తాజా వీడియో ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టిస్తోంది. మెట్రో స్టేషన్‌లో మెట్లపైనా, మెట్రోలోనూ లైంగిక కార్యకలాపాలు నెరుపుతున్న వీడియో క్లిప్పింగ్ ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చింది. ఈ వీడియో క్లిప్‌ను ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ (డిఎంఆర్‌సి) దర్యాప్తు నిమిత్తం చీఫ్ సెక్యూరిటీ కమిషనర్‌కు పంపింది.
గతంలో అటువంటి వీడియో క్లిప్పులపై ఢిల్లీ సైబర్ క్రైమ్ సెల్ పోలీసులు పరిశీలించారని ఢిల్లీ మెట్రో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుజ్ దయాళ్ చెప్పారు. ప్రజా రవాణా సిస్టంలో ప్రయాణిస్తున్నప్పుడు హుందాగా, క్రమశిక్షణతో, సభ్యతతో నడుచుకోవాలని డిఎంఆర్‌సి ప్రజలకు విజ్ఞప్తి చేస్తోందని ఆయన చెప్పారు.
ఖాళీ రైళ్లలో జంటలు లైంగిక కార్యకలాపాలు జరుపుతున్న 250 క్లిప్పులతో 2 నుంచి 8 నిమిషాల వీడియోలను రూపొందించి, పోర్న్ సైట్లలో అప్‌లోడ్ చేశారు. సిసిటివి ఫుటేజ్‌లను కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగం (సిఐఎస్ఎఫ్) నిర్వహిస్తుందని, ఆ ఫుటేజ్‌ల లీకేజీలకు బాధ్యత అదే వహించాల్సి ఉంటుందని డిఎంఆర్‌సి వాదిస్తోంది. ఆ వాదనను సిఐఎస్ఎఫ్ ఖండిస్తోంది. తమది కేవలం మోనిటిరింగ్ ఏజెన్సీ మాత్రమేనని చెప్పింది.












Click it and Unblock the Notifications