కదులుతున్న కారులో అమ్మాయిపై గ్యాంగ్ రేప్

ఈ ఘటనకు సంబంధించి సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం సాయంత్రం యువతి కోచింగ్ క్లాసులకు హాజరై శాస్ర్తి నగర్‌లోని తన ఇంటికి బయలు దేరింది. ఇద్దరు వ్యక్తులు బాధితురాలిని తమ స్పోర్ట్స్ యుటిలిటి వాహనంలో లిఫ్ట్ ఇస్తామని అడిగారని పోలీసులు తెలిపారు. వారిరువురిని అమిత్ భాదన, సుమిత్ గుర్జార్‌లుగా గుర్తించారు. నిందితులిద్దరూ బాధితురాలికి తమపై నమ్మకం కలిగించేందుకు ఫేస్‌బుక్ పరిచయం ఉందని చెప్పారన్నారు.
దీంతో వాహనంలోకి ఎక్కిన బాధితురాలిపై కొద్ది దూరం వెళ్లిన తర్వాత మొత్తం నలుగురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, ఆపై ఆమెను పట్టణంలోని పివిఎస్ మాల్ సమీపంలో పడేసి వెళ్లిపోయారని పోలీసులు చెప్పారు. ఇదిలావుంటే బాధితురాలి ఫిర్యాదుతో ఐపిసి 376 సెక్షన్ క్రింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోటోల ద్వారా బాధితురాలు గుర్తించిన అమిత్ భాదన, సుమిత్ గుర్జార్‌లతోపాటు మిగతా ఇద్దరినీ త్వరలోనే అరెస్ట్ చేస్తామని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దీపక్ కుమార్ తెలిపారు.
మరోవైపు ఘటన జరిగిన మరుసటి రోజు బాధితురాలి ఇంటికి వెళ్లిన నిందితులు జరిగిన ఘోరంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని బాధితురాలిని, ఆమె సోదరుడిని హెచ్చరించినట్లు పోలీసులు చెప్పారు. అయినప్పటికీ జరిగినదంతా బాధితురాలు తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు ఫిర్యాదు చేశారని, నౌచాంది ఏరియా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications