కారులో నుండి లాగి.. టివి యాంకర్‌కు వేధింపులు

TV anchor molested near Kolkata's Howrah station
కోల్‌కతా: మహారాష్ట్రలోని ముంబైకి చెందిన ఓ టివి యాంకర్‌ను పశ్చిమ బెంగాల్‌లోని హౌరా రైల్వే స్టేషన్ సమీపంలో వేధించారు. నిందితులను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి చెందిన టివి యాంకర్ తన తండ్రి, ఒక స్నేహితుడితో కలిసి కోల్‌కతా నగరాన్ని చూసేందుకు వచ్చారు.

ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్ వద్ద రతన్ సాహు అనే వ్యక్తి ఆమెను వేధించాడు. వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం అతనిని బెయిల్ పైన విడుదల చేశారు. తనపై దాడి చేసిన వ్యక్తిని ఎదుర్కోవడానికి ఆమె ప్రయత్నించారు.

కారులో ఉన్న యాంకర్‌ను సాహు బయటకు లాగే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో నిందితుడు ఆమె తండ్రి పైన దాడికి పాల్పడ్డాడు. టివి యాంకర్‌ను వేధించడం, తండ్రి పైన దాడికి పాల్పడటం పలువురు చూస్తుండగానే జరిగింది.

మరోవైపు ఇదే హౌరా జిల్లాలోని బేలూరు రైల్వే స్టేషన్ వద్ద ఓ యువతి రైలులో నుండి దూకింది. 25 ఏళ్ల సాఫ్టువేర్ ఇంజనీర్ వేధింపుల నుండి తప్పించుకునేందుకు ఆ యువతి రైలు నుండి దూకింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

మరో ఘటనలో... కోల్‌కతా మెట్రోలో తన కుటుంబంతో పాటు ప్రయాణిస్తున్న ఓ యువతిని ఇద్దరు విద్యార్థులు వేధించారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+