విజయమ్మకు తెలంగాణ సెగ: పార్టీ ఆఫీసు ముట్టడి

Telangana heat to YS Vijayamma at Mahankali temple
హైదరాబాద్: తెలంగాణపై మాట మార్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి తెలంగాణ సెగ తగులుతోంది. సికింద్రాబాదులోని ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దర్శనానికి వచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మకు తెలంగాణ సెగ తగిలింది. పార్టీ వైఖరిని నిరసిస్తూ తెలంగాణవాదులు ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఆలయ కమిటీ సభ్యులు, పోలీసులు జోక్యం చేసుకుని విజయమ్మను ఆలయంలోకి తీసుకుని వెళ్లారు. ఈ సమయంలో మహంకాళి జాతర వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైఖరి మార్చుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. మహిళా భక్తులే విజయమ్మను అడ్డుకోవడానికి ప్రయత్నించారు.

ఇదిలావుంటే, సమైక్యవాదాన్ని వినిపిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైఖరిని నిరసిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం జెఎసి (ఓయుజెఎసి) కార్యకర్తలు ఆదివారంనాడు హైదరాబాదులోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతు ఆ పార్టీ శానససభ్యులు రాజీనామాలు చేయడంపై వారు మండిపడ్డారు.

తెలంగాణపై సానుకూల ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో తెలంగాణను అడ్డుకోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు రాజీనామాలు చేశారని వారు విమర్శించారు. పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+