విభజిస్తే నేనే లీడర్!: ఎర్రబెల్లి, నష్టం కాంగ్రెస్‌కే: కోడెల

వరంగల్ జిల్లా రాయపర్తిలో ఆయన పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సమితి సొత్తు కాదన్నారు. కాంగ్రెసు, తెరాస పార్టీలు ప్రజలను దోచుకు తింటున్నాయని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో టిడిపిని గెలిపించాలని కోరారు.
నష్టపోయేది కాంగ్రెస్సే: కోడెల
విభజన జరిగితే తాగునీరు, విద్యుత్, శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని తెలుగుదేశం పార్టీ నేత కోడెల శివప్రసాద రావు గుంటూరులో అన్నారు. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ వంటి అనుభవజ్ఞుల సూచనలను యూపిఏ తీసుకోవాలని, లేదంటే నష్టపోయేది కాంగ్రెసు పార్టీయే అన్నారు.
రాహుల్‌ను ప్రధాని చేసేందుకే: గోరంట్ల
విదేశీ వనితకు మన ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలియక తెలుగు జాతిని ముక్కలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన తెలుగుదేశం పార్టీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. తన కొడుకు రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేయడానికి సిద్ధమయ్యారని విమర్శించారు.
విదర్భ, గూర్ఖాలాండ్ వంటి సమస్యలు ఎప్పటినుంచో ఉన్నా రాజకీయ లబ్ధి కోసం తెలుగువాళ్ల మధ్య చిచ్చుపెట్టడం ప్రమాదకరమని, దీనిపై తాము పోరాటానికి సిద్ధమని చెప్పారు.












Click it and Unblock the Notifications