క్రెడిట్ మాది కాదు: రాములమ్మ, కూల్ అని సోనియా

vijayasanthi and sonia gandhi
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ విజయం తమ పార్టీదో, మరో పార్టీదో కాదని తెలంగాణ ప్రజలందరిదని తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా నేత, మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి బుధవారం అన్నారు. తెలంగాణపై పూర్తిగా ఆశలు వదులుకున్నాక ప్రకటన వచ్చిందని, ఇది తమను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. కాంగ్రెసు పార్టీ ఇక తెలంగాణ ఇవ్వదని, ఆ పార్టీ పైన నమ్మకం లేదని తాను ఎన్నోసార్లు చెప్పానన్నారు.

కానీ ఏదో మిరాకిల్ జరిగి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇస్తే బాగుంటుందనుకున్నానని, అది జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు అందరు సంతోషంగా ఉన్నారన్నారు. తమకు స్వాతంత్రం వచ్చినట్లుగా ఉందన్నారు. పట్టుబట్టినప్పుడు రాకుండా, ఆశలు వదులుకున్నప్పుడు రావడం మాయలా అనిపిస్తోందన్నారు. ఇది ఏ పార్టీదో కాకుండా ఉద్యోగులు, విద్యార్థులు, కళాకాలు, ప్రజల విజయమన్నారు.

ఇప్పుడు తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వారి ఆత్మలు శాంతిస్తాయన్నారు. యూపిఏ, సిడబ్ల్యూసి తెలంగాణపై ఎంత త్వరగా నిర్ణయం తీసుకుందో అంతే వేగంగా పార్లమెంటులో బిల్లు పెట్టి పాస్ జరిగేలా చూడాలని కోరారు. ఇది తొందరగా జరగాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.

మీ సోదరులే సంయమనం పాటించండి!: సోనియా

సీమాంధ్ర ప్రాంతం వారు మీ సోదరులేనని, సంయమనం పాటించాలని తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తమకు సూచించారని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు అన్నారు. సోనియాతో టి నేతలు భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసుండాలని సోనియా సూచించారని, అనివార్యమై విభజనపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారని అన్నారు.

ఏ సమస్యనైనా ఇరు ప్రాంత నేతలు చర్చించి పరిష్కరించుకోవాలని, శాంతిభద్రతలు వాటిల్లకుండా కలిసిమెలిసి ఉండాలని చెప్పారన్నారు. తెలంగాణలో పార్టీని గెలిపించేందుకు కృషి చేయమని సూచించారన్నారు. తెలంగాణపై సానుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు తాము సోనియాకు కృతజ్ఞతలు తెలిపామన్నారు. తీర్మానానికి సహకరించిన సీమాంధ్ర నేతలకు ధన్యవాదాలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+