ఇంకా అస్త్రాలు, స్టార్ బ్యాట్స్‌మెన్ రిటైర్డ్ హర్ట్: లగడపాటి

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమ వద్ద చాలా అస్త్రాలు ఉన్నాయన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తాము దేనికైనా సిద్ధమన్నారు. విభజనకు అన్నీ పార్టీలు ఒప్పుకున్నాకనే తమ పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ అడిగితే... తెలుగుదేశం పార్టీ ఇచ్చేయమనగా... వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యంతరం లేదని చెప్పిందన్నారు.
తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ దానిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల వల్లనే విభజనకు బీజం పడిందన్నారు. తెలుగు తల్లిని ముక్కలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. విభజనను అడ్డుకునే ఉద్దేశ్యంలో భాగంగానే తాము రాజీనామాలు సమర్పించినట్లు చెప్పారు.
తెలంగాణ వారికి ఎలాంటి అన్యాయం జరగలేదని, జరిగిందంతా సీమాంధ్ర వారికే అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముక్కలు కానీయమన్నారు. ప్రజలు రోడ్డెక్కాక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మైండ్ బ్లాంక్ అయిందన్నారు. తమ స్టార్ బ్యాట్సుమెన్ రిటైర్డ్ హర్ట్ అయ్యారని, ఔట్ కాలేదని చెప్పారు. సీమాంధ్ర ప్రజలకు అండగా ఉండేందుకు రాజీనామా చేసినట్లు చెప్పారు.
అధిష్టానానికి కొందరు అవాస్తవాలు చెప్పారని, సాగునీరు, రాజధాని పైన చర్చించలేదని అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి అన్నారు. స్పీకర్ ఫార్మాట్లో తాము రాజీనామాలు చేసినట్లు చెప్పారు. ప్రజల పక్షాన నిలిచేందుకు రాజీనామాలు చేశామని సాయి ప్రతాప్ అన్నారు. మూడు ప్రాంతాల వారిని పిలిచి మాట్లాడకుండా విభజన నిర్ణయం తీసుకుందన్నారు.
శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు ఏమయిందని అమలాపురం ఎంపి హర్ష కుమార్ ప్రశ్నించారు. సీమాంధ్ర పరిస్థితిని తెలిపేందుకే రాజీనామా చేశామని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. కేంద్రం సమైక్యాంధ్రపై అశ్రద్ద చేయకూడదని తాము రాజీనామాలు చేశామన్నారు.












Click it and Unblock the Notifications