ఎమ్మెల్యే పేరు చెప్పి నగలెత్తుకెళ్లిన జగన్ పార్టీ కార్యకర్త?

తమను ఎమ్మెల్యే పంపారని, ఆన్‌లైన్‌లో డబ్బు పంపుతామన్నారని చెప్పి రూ.20 లక్షల విలువైన ఆభరణాలు తీసుకెళ్లింది. ఎమ్మెల్యే సుచరిత భర్త ఉన్నతాధికారి కావడంతో దుకాణం నిర్వాహకులు అనుమానించలేదు. రెండు రోజుల తర్వాత రూ.5-6లక్షల విలువైన ఆభరణాలను దుకాణ యజమానికి తిరిగిచ్చారు.
మిగిలిన వాటి గురించి, డబ్బు గురించి ఏమీ చెప్పలేదు. దీంతో ఎమ్మెల్యే డబ్బు పంపుతారని యజమాని ఎదురు చూశారు. ఎంతకూ సమాచారం లేకపోవడంతో ఆమెతో వచ్చిన వ్యక్తిని నిలదీశారు. దీంతో ఆభరణాలు తీసుకెళ్లింది కల్యాణి అని వెల్లడైంది. దీంతో షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, ఎమ్మెల్యే సుచరిత ఫోన్ చేయలేదని పోలీసు విచారణలో తేలడంతో వారు కల్యాణిని, మరొకతనిని అదుపులోకి తీసుకుని, నగలు రికవరీ చేశారు. మరోవైపు కల్యాణి వాడుతున్న కారుకు ద్విచక్ర వాహనం నంబర్ వేసినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు ఆరా తీస్తున్నారు.
హైదరాబాదులో చదువుకున్న కల్యాణి ఓ యువకుడిని పెళ్లి చేసుకుని, రెండు నెలలకే విడిపోయింది. ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్ వెళ్లి, తిరిగి వచ్చాక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల పాదయాత్ర చేపట్టినప్పుడు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసిందట.












Click it and Unblock the Notifications