నాకు నచ్చని పదం రాజీనామా: చిరుపై 'స్టాలిన్' నిరసన

పోస్టర్‌లో చిరంజీవి స్టాలిన్ సినిమాలో చెప్పిన అంశాన్ని రాజీనామాకు అనుగుణంగా ఎద్దేవా చేస్తూ జోడించారు. 'తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం రాజీనామా. నా ఇంటి ముందు ధర్నా చేయమని ముగ్గురికి చెప్పండి. ఆ ముగ్గురు మరో ముగ్గురికి చెబుతారు. రాజీనామా చేయవద్దని ముగ్గురికి చెప్పండి. ఆ ముగ్గురు మరో ముగ్గురికి చెబుతారు. అలా ఎవరూ రాజీనామా చేయరు.' అంటూ పోస్టర్‌లో పేర్కొన్నారు. కాగా బందరు రోడ్డులోని మంత్రి పార్థసారథి ఇంటిని సమైక్యవాదులు ముట్టడించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు: శ్రీధర్ బాబు
రాబోయే సాధారణ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతాయని పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కరీంనగర్ జిల్లాలో అన్నారు. తెలంగాణ విషయంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని చెప్పారు. ఈ అంశంలో ఏమైనా అభ్యంతరాలుంటే కాంగ్రెసు ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీకి తెలపాలని చెప్పారు.
హైదరాబాదు రాజధానిగా పది జిల్లాల తెలంగాణకే కాంగ్రెసు పార్టీ మొగ్గు చూపుతోందన్నారు. దీనికి సంబంధించిన బిల్లును త్వరలోనే పార్లమెంటులో ప్రవేశ పెట్టే అవకాశముందన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించాలని మంత్రి సీమాంధ్ర ప్రజలను, నేతలను కోరారు.












Click it and Unblock the Notifications