కెసిఆర్ హత్యకు కుట్ర, సుపారీ ఇచ్చారు: హరీష్ రావు

ఎవరు సుపారీ ఆఫర్ చేశారు... ఎవరు తీసుకోవడానికి వచ్చారో తమ దగ్గర పూర్తి సమాచారముందని, సమయం వచ్చినప్పుడు తాము దానిని బయటపెడతామన్నారు. కెసిఆర్ హత్యకు కుట్రపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అధ్యక్షుడికి ఏమైనా జరిగితే తెలంగాణ అల్లకల్లోలం అవుతుందన్నారు.
హత్యకు కుట్ర పన్ని వారి సమాచారం ఉందని, అవసరమైతే సమాచారం ఇస్తామన్నారు. కెసిఆర్‌కు జడ్‌ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని మూడు రోజుల క్రితం ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు. పార్టీ తరఫున ప్రభుత్వానికి రిట్ పిటిషన్ ఇస్తామన్నారు.
కెసిఆర్ విషయంలో ప్రభుత్వం వివక్ష చూపిస్తోందన్నారు. కెసిఆర్‌ను పోలీసులు కంటికి రెప్పలా కాపాడాలని కోరుతున్నామన్నారు. సీమాంధ్ర నేతలు ఎంతటి దుర్మార్గానికైనా దిగజారుతారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని భద్రత కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. లేదంటే తామే తమ ఉద్యమ నేతను రక్షించుకుంటామన్నారు. కుట్ర ఫోన్ కాల్స్ పరంపర కొనసాగుతోందన్నారు.












Click it and Unblock the Notifications