టి: కాంగ్రెస్ నేతలు కెసిఆర్‌ను ఢీకొట్టలేకపోతున్నారా?

అయితే దీనిని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు అంత పెద్ద మొత్తంలో క్యాష్ చేసుకోలేకపోతున్నారని అంటున్నారు. టికి అనుకూలంగా కాంగ్రెసు పార్టీ నుండి ప్రకటన వెలువడిన తర్వాత తెరాసలో, కెసిఆర్‌లో కొంత అయోమయం కనిపించిందనే చెప్పవచ్చు. అయితే ఆ తర్వాత కుదురుకున్న కెసిఆర్... క్రెడిట్‌ను కాంగ్రెసు ఖాతాలో కాకుండా తన ఖాతాలో వేసుకునే ప్రయత్నాలను ప్రారంభించారు.
అందులో భాగంగా రెండు రోజుల క్రితం టిజెఎఫ్ మీట్ ది ప్రెస్‌లో తన కలల తెలంగాణను ముందుంచారు. క్రెడిట్ తనకు దక్కేలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని అంటున్నారు. అదే సమయంలో టి కాంగ్రెసు నేతల్లో మాత్రం రాకముందు ఉన్న ఉత్సాహం ఇప్పుడు కనిపించడం లేదని అంటున్నారు. పార్టీ తెలంగాణకు అనుకూలంగా నేతలు కలిసి ప్రకటన చేసిన సందర్భాలు దాదాపు లేవనే చెప్పవచ్చు.
తెలంగాణ ప్రకటనకు ముందు ప్రముఖ పాత్ర పోషించిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఇప్పటి వరకు బయట కనిపించలేదు! పిసిసి మాజీ చీఫ్ డి శ్రీనివాస్, మంత్రి జానా రెడ్డి అడపాదడపా ప్రకటనలు చేస్తున్నారు. అంతకుముందు ఇచ్చేది మేమే... తెచ్చేది మేమే అన్న నేతలు, చెప్పిన మాట నిలబెట్టుకున్నామని గట్టిగా చెప్పిన సందర్భం లేదని చెప్పవచ్చు. ఇదే అదునుగా కెసిఆర్ భవిష్యత్తు తెలంగాణ పేరుతో దూసుకుపోతున్నారంటున్నారు.












Click it and Unblock the Notifications