ఇంటికొచ్చి అమ్మాయిపై కాల్పులు: ప్రేమ వ్యవహారమే?

కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అమ్మాయిని సాకేత్‌లోని మాక్స్ ఆస్పత్రిలో చేర్చారు. విపరీతమైన రక్త స్రావం కావడంతో అమ్మాయి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్‌పై వచ్చి అమ్మాయి గురించి వాకబు చేశారు. ఇంట్లోకి చొరబడి నాటు తుపాకితో ఆ 17 ఏళ్ల అమ్మాయిపై కాల్పులు జరిపారు.
అమ్మాయిపై కాల్పులు జరిపిన తర్వాత వారు అదే మోటార్ సైకిల్‌పై పారిపోయారు. ప్రేమ వైఫల్యం గానీ వ్యక్తిగత కక్షలు గానీ ఈ సంఘటనకు కారణమై ఉండ వచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యాప్రయత్నం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
దేశరాజధాని ఢిల్లీలో తరుచుగా ఈ విధమైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆందోళన వ్యక్తమవుతూనే ఉన్నది.












Click it and Unblock the Notifications