పెళ్లి ప్లాన్ పేరుతో హోటల్‌కు తీసుకెళ్లి టెక్కీ గ్యాంగ్ రేప్!

Techie raped in Shamshabad
హైదరాబాద్: రాజధాని పరిసరాల్లోని శంషాబాద్‌లో ఓ టెక్కీ సామూహిక అత్యాచారానికి గురైంది. ఆమెపై నలుగురు ఈ దాష్టీకానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరు మాట్రిమోనియల్ సైట్ ద్వారా బాధిత యువతికి పరిచయమైన వ్యక్తి కూడా ఉన్నాడు. శంషాబాద్ హోటల్లో నిందితుడుని బాధితురాలు కలుసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కూకట్‌పల్లికి చెందిన 27 ఏళ్ల యువతి తన భర్త నుండి విడాకులు తీసుకున్నారు. ఆమె మాదాపూర్‌లో సాఫ్టువేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. ఇటీవలే ఆమెకు ఆమెకు శ్రీకాంత్ అనే యువకుడితో మాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకునేందుకు ఇద్దరు సిద్ధపడ్డారు.

ఆగస్టు 2వ తేదిన శంషాబాదులోని ఓ హోటల్లో బాధితురాలు, శ్రీకాంత్‌లు దిగారు. సాయంత్రం ముడున్నర గంటలకు వచ్చిన వారు ఆ తర్వాత ఏడున్నర గంటలకు వెళ్లిపోయారు. ఆ తర్వాత మంగళవారం రోజు యువతి పోలీసులను ఆశ్రయించారు. తనపై హోటల్లో శ్రీకాంత్ ఆయన ముగ్గురు స్నేహితులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించారు.

పెళ్లి విషయం చర్చించేందుకు శ్రీకాంత్‌తో కలిసి హోటల్లో దిగానని కానీ, అక్కడ వారు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆమో ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు 342, 376జి, 379, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు. మహిళను పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. ప్రధాన నిందితుడుని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+