వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీతో 'బి'టౌన్ హీరో అక్కీ క్రీడా ముచ్చట్లు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: ప్రముఖ బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, పరేష్ రావల్‌లు బుధవారం గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీని గాంధీనగర్‌లో కలుసుకున్నారు. వారి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి.

క్రీడల ప్రమోషన్ కోసం, యువత కోసం గుజరాత్ ప్రభుత్వం చేపట్టిన అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. అక్షయ్, పరేష్ రావల్‌లు క్రీడల పట్ల తమకున్న ఆసక్తిని మోడీ ముందుంచారు. జూడో, కరాటే వంటి వాటికి తమ వంతు సాయం చేస్తామని వారు తెలిపారు. అదే సమయంలో క్రీడా విశ్వవిద్యాలయం నెలకొల్పే ఉద్దేశ్యం ఉన్నట్లు చెప్పారు.

ఈ భేటీలో మోడీ యోగా విశ్వవిద్యాలయం అంశాన్ని కూడా ప్రస్తావించారు. అక్షయ్ కుమార్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం ఉంది. దీంతో దేశవ్యాప్తంగా పలు కళాశాలలు, పాఠశాలల్లో మార్షల్ ఆర్ట్స్‌ను ప్రోత్సహించే చర్యలు చేపట్టారు. గతంలోను అక్షయ్ కుమార్ మోడీని మార్షల్ ఆర్ట్స్ ప్రమోషన్ విషయమై కలిశారు.

మర్యాదపూర్వక భేటీ

మర్యాదపూర్వక భేటీ

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, నటుడు పరేష్ రావల్‌లు బుధవారం గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీని గుజరాత్ రాజధాని గాంధీ నగర్‌లో కలిశారు.

మాటా మంతి

మాటా మంతి

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని బుధవారం గాంధీ నగర్‌లో కలిసి మాట్లాడుతున్న ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం ఉంది.

ముగ్గురి ముచ్చట

ముగ్గురి ముచ్చట

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని బుధవారం గాంధీ నగర్‌లో కలిసి మాట్లాడుతున్న ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, నటుడు పరేష్ రావల్.

 మోడీ సన్నిహితుడుతో పరేష్

మోడీ సన్నిహితుడుతో పరేష్

గతేడాది డిసెంబర్లో సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన పాకిస్తాన్ - భారత్ ట్వంటీ 20 మ్యాచును పరేష్ రావల్ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సన్నిహితుడు అమిత్ షాతో కలిసి చూస్తున్న దృశ్యం.

English summary
Bollywood actors Paresh Rawal and Akshay Kumar met Gujarat Chief Minister Narendra Modi here on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X